సారథిన్యూస్, నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం ఆమె నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ నిగిడాల సురేశ్, ఎస్ఐ గుత్తా వెంకట్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్, సతీశ్, రాము, షకీల్, కిరణ్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.