సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పెద్దసముద్రాల గ్రామంలోని పోచమ్మ గుడిలో ఎలుగుబంటి ప్రవేశించడం ఆసక్తిరేపింది. శుక్రవారం రాత్రి ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న పోచమ్మ ఆలయంలోకి గుడ్డెలుగు ప్రవేశించగానే గ్రామస్తులు గుడిగేట్లను మూసి తాళం వేశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గుడ్డెలుగు సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు, రైతులు వ్యక్తం చేస్తున్నారు.