వాషింగ్టన్: రెండు విమానాలు ఢీకొని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకున్నది. విమానాలు కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయాయి. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. రెండు విమానాల శకలాలను సోనార్ సాయంతో గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు.