భద్రాచలం: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే చివరిదైన మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ప్రస్తుతం నీటి ప్రవాహం భద్రాచలం వద్ద 60 అడుగులకు చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. 2014 తర్వాత ఈ స్థాయిలో వరద రావడంతో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. 2014, సెప్టెంబర్ 8న భద్రాచలం […]