Breaking News

PEDDASHANKARAMPET

మధ్యాహ్నం ఒంటి గంట వరకే షాపులు

మధ్యాహ్నం ఒంటి గంట వరకే షాపులు

సారథి, పెద్దశంకరంపేట: రోజురోజుకూ కొవిడ్-19 విస్తరిస్తున్న దృష్ట్యా మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటలో అన్ని వర్తక, వాణిజ్య, ఇతర వ్యాపార సంస్థలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరిచి ఉంచాలని, అనంతరం మూసివేయాలని పెద్దశంకరంపేట సర్పంచ్ ఆలుగుల సత్యనారాయణ కోరారు. శుక్రవారం పేట పట్టణంలో పురవీధుల గుండా తిరుగుతూ మైక్ ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేశారు. ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఈవో విఠల్​, పంచాయతీ సిబ్బంది […]

Read More
బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి

బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి

సారథి: పెద్దశంకరంపేట: ఓ మహిళ వ్యవసాయ బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన శుక్రవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి సమీపంలోని జరిగింది. మండల కేంద్రానికి చెందిన అనూషమ్మ(45) మంళవారం బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడింది. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన వారికి ఆమె శవమై కనిపించింది. అనూషమ్మకు దుర్గమణి, సాయమ్మ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అనూషమ్మ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. భర్త స్థాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More
ఘనంగా వీరభద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా వీరభద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండల పరిధిలోని గొట్టుముక్కల గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో నాలుగో వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శనివారం ప్రారంభమైన నాలుగో వార్షికోత్సవ వేడుకలు, స్వామివారి ఆభరణాల ఊరేగింపు అనంతరం అభిషేకంతో ముగిశాయి. స్వామివారికి ఆభరణాలను అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ఘనంగా పూజలు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్షికోత్సవంలో భాగంగా ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. దేవస్థానం వద్ద సత్రాల నిర్మాణం, వివిధ అభివృద్ధి […]

Read More
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి

సారథి, పెద్దశంకరంపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోరా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి పెద్దశంకరంపేట మండలంలోని కొప్పోలు ఉమాసంగమేశ్వర ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ప్రత్యేకపూజలు జరిపించారు. ఆయన వెంట పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, సర్పంచ్​ ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీలు వీణా సుభాష్ గౌడ్, స్వప్న రాజేశ్వర్, మల్లేశం, సుధాకర్, రాజేశ్వరి […]

Read More
కరెంట్​ షాక్​తో మహిళ మృతి

కరెంట్​ షాక్​తో మహిళ మృతి

మృతురాలు రాజస్థాన్​ వాసి సారథి: పెద్దశంకరంపేట: మండల కేంద్రమైన పెద్దశంకరంపేట ప్రియాంకకాలనీలో విద్యుదాఘాతంతో ప్రజాపతి కేసరి (22)అనే మహిళ చనిపోయింది. ఇంట్లో ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. భర్త వినోద్ కుమార్ తో పాటు ఆమె రాజస్థాన్ నుంచి జీవనోపాధికి పెద్దశంకరంపేట వచ్చిన ఈ కుటుంబం ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఐస్ క్రీమ్ తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ప్రజాపతి కేసరి […]

Read More
మౌలిక సదుపాయాల కల్పనకు స్పెషల్ డ్రైవ్

మౌలిక సదుపాయాల కల్పనకు స్పెషల్ డ్రైవ్

సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టిందని ఎంఈవో పోచయ్య అన్నారు. శనివారం ఆయన మండలంలోని పలు ప్రభుత్వ స్కూళ్లను తనిఖీచేసి హెడ్ మాస్టర్లు ఆన్ లైన్ లో నమోదు చేసిన వివరాలను సరిచూశారు. స్థానిక బాలికల ప్రాథమిక పాఠశాల, బాలుర ప్రాథమిక పాఠశాలతో పాటు పలు స్కూళ్లను తనిఖీచేశారు. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు కూడా తమ పరిధిలోని స్కూళ్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు […]

Read More
ముసాయిదా ఓటర్ల జాబితా రెడీ

ముసాయిదా ఓటరు జాబితా రెడీ

సారథి, పెద్దశంకరంపేట: తెలంగాణ స్టేట్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఖాళీగా ఉన్న రెండు ఎం‌పీటీసీ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహణలో భాగంగా గ్రామపంచాయతీ ఆఫీసుల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచినట్లు ఎం‌పీడీవో రాజ్ నారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన గ్రామ పంచాయతీలలో నోటిస్ అతికించినట్లు ఆయన చెప్పారు. కోళ్లపల్లి, పెద్దశంకరంపేట పరిధిలోని 1వ ఎంపీటీసీ స్థానం, ఇస్కపాయల తండా, మక్తలక్ష్మాపూర్ వార్డు […]

Read More
ఉత్సాహంగా పోషణ్​ అభియాన్​

ఉత్సాహంగా పోషణ్​ అభియాన్​

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషణ్​ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్​ వాడీ సెంటర్లలో సెంటర్లలో పెద్దశంకరంపేట గ్రామంలో పోషణ అభియాన్ కార్డులు ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో అంగన్​వాడీ టీచర్లు సుక్కమ్మ, అనురాధ అంగన్​వాడీ ఆయాలు పాల్గొన్నారు. వడ్డెర కాలనీ సెంటర్​లో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. అంగన్​వాడీ టీచర్ అనురాధ, ఆయా పాల్గొన్నారు.

Read More