సారథిన్యూస్, మహబూబాబాద్: కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతం ఆదేశించారు. జిల్లా కేంద్రం సమీపంలోని కురవిలో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలో పర్యటించారు. వాహనాలు రోడ్లపై నిలుపకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపికచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో కొత్తగా ఐదు గోదాములు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ […]