నిర్వహణపై అధికారుల తీరు మారాలి గ్రామాల్లో పనులను పరిశీలించిన కలెక్టర్ హరీశ్ సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన పెద్దశంకరంపేట మండలంలోని జాంబికుంట, ఆరెపల్లి, కమలాపూర్, బుజ్రన్ పల్లి, కొల్లపల్లి తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. ఆరేపల్లిలో గోతుల్లో మొక్కలు ఉండకుండా, కలుపు మొక్కలు పెరగడంతో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ […]