సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని దత్తోజిపేట, లక్ష్మీపూర్, వెంకట్రపల్లి గ్రామాల్లో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ రవీందర్ ప్రారంభించారు. వెలిచాల గ్రామంలో సర్పంచ్ వీర్ల సరోజ కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డైరెక్టర్లు ధ్యావ అనంతరెడ్డి, ఊట్కూరి అనిల్ రెడ్డి, లచ్చయ్య, కరుణాకర్, వీర్ల రవీందర్ రావు, సిబ్బంది మల్లేశం, నరేష్, ఇతర రైతులు పాల్గొన్నారు.