– సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సారథి న్యూస్, గోదావరిఖని: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వానాకాలంలో నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. వ్యవసాయరంగ సంబంధిత అంశాలపై శనివారం ఆయన కలెక్టర్ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్టీపీసీ మిలీనియం హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వానాకాలం పత్తి, […]
సారథి న్యూస్, గోదావరిఖని: లాక్ డౌన్ నేపథ్యంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులతో పాటు రెడ్ జోన్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో పాటు ప్రోత్సాహకంగా రూ.8వేలు చెల్లించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక జ్యోతిభవన్ లో ఎన్టీపీసీ ఈడీ రాజ్ కుమార్ తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ప్రకటించినట్లుగా ఎన్టీపీసీ నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి […]