సారథి, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. టీఆర్ఎస్‌లో ఎన్నో ట్విస్ట్ ల మధ్య నోముల భగత్ కు టికెట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. అభ్యర్థిని ప్రకటించడంతో పాటు వెంటనే బీ ఫామ్ కూడా అందజేయడంతో ఉత్కంఠతకు తెరతీసినట్లయింది. నర్సింహాయ్య కుటుంబానికి బాసటగా నిలుస్తానన్న హామీ మేరకు ఆయన కుమారుడికి టికెట్ కేటాయించారు. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కె.జానారెడ్డి అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారైంది. ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారంలో […]