దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో అతను చోటు దక్కించుకున్నాడు. దీంతో అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 2020–21 సీజన్ కోసం ఐసీసీ ప్రకటించిన జాబితాలో నిగెల్ లాంగ్ (ఇంగ్లండ్) స్థానంలో నితిన్‌కు చోటు కల్పించారు. 3 టెస్టు, 24 వన్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ నిర్వహించిన 36 ఏళ్ల నితిన్.. ఇండియా తరఫున ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించిన మూడో వ్యక్తి. గతంలో […]