ప్రతాప్‌ఘడ్: అత్యాచారం చేసే వారిని శిక్షించేందుకు కఠిన శిక్షలు వచ్చినా.. ఉరిశిక్ష విధించి చంపినా కొంత మంది మృగాలకు బుద్ధి రావడం లేదు. మహిళల రక్షణ కరువైంది. దాదాపు పది ఏండ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం చోటుచేసుకున్న రీతిలోనే యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో అలాంటి తరహా ఘటనే జరిగింది. కదులుతున్న బస్సులో ఒక మహిళపై కొంత మంది అత్యాచారానికి పాల్పడ్డారు. పిల్లలను చంపుతామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. యూపీలోని ప్రతాప్‌ఘడ్ నుంచి నోయిడాకు వెళ్లేందుకు […]
అవును ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య ఎక్కడినుంచి మొదలు పెట్టాలన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. స్త్రీ లోకం కోసం మాట్లాడేందుకు ఎన్నో శ్లోకాలు. ‘యత్రనారీయంతు..’ అంటూ కోకొల్లలు. ఇక మన శక్తిమంతులైన దేవతామూర్తులంతా మాతృస్వరూపులే. వారికి మొక్కని రోజు ఉండదు. కోరని వరాలు ఉండవు. ఇలా లక్ష్మీ, సరస్వతి, పార్వతి, దుర్గ, కాళికా, చండిక.. ఒక్కరేమిటి లెక్కకు మిక్కిలి. మరి అన్ని శక్తులను అమ్మరూపంగా ఆరాధిస్తున్న మనం ఆడపిల్లల పట్ల చూసే చూపులోనే తేడా వస్తోంది ఎందుకు. […]