Breaking News

NEWPROJECT

వెబ్​సీరీస్ ప్లానింగ్​లో అర్జున్​రెడ్డి డైరెక్టర్​

అర్జున్​రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్​ వంగ ఓ వెబ్​సీరీస్​ తీసేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ వెబ్​సీరీస్​ను యంగ్​ హీరో విజయ్​ దేవరకొండ నిర్మించనున్నట్టు టాక్​. అర్జున్​రెడ్డి చిత్రాన్ని సందీప్​వంగా హిందీలో కబీర్​సింగ్​గా తెరకెక్కించి సూపర్​ హిట్​ అందుకున్నాడు. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఈ క్రమంలో ఓ విభిన్న కథతో వెబ్​సీరీస్​ను తెరకెక్కెంచనున్నట్టు టాక్​. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ లీడ్​ పాత్రలో నటిస్తారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. […]

Read More

ప్రభాస్​ న్యూ ప్రాజెక్ట్​ ‘ఆదిపురుష్​’

యంగ్​రెబల్​ స్టార్​ ప్రభాస్​ తన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. ‘ఆదిపురుష్​’ అనే పాన్​ఇండియా మూవీలో తాను నటించబోతున్నట్టు అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చాడు. ఈ కొత్తచిత్రానికి ‘తనాజీ’ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్హన్​కుమార్​ , టీసీరిస్​వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 5 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కునున్నట్టు సమాచారం. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్​ కానున్నది. ‘ఆదిపురుష్​’ అనే ఈ చిత్రం ఇతిహాస కథ […]

Read More

కేజీఎఫ్​ డైరెక్టర్​తో ప్రభాస్​ సినిమా

కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​నీల్ దర్శకత్వంలో యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ ఓ సినిమా చేయనున్నట్టు టాక్​. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. యువతకు, మాస్​ ఆడియన్స్​ను ఆకట్టుకోవడంలో ప్రశాంత్​ నీల్​ దిట్ట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్​ చిత్రం సంచలన విజయం సాధించింది. మొత్తం భారతీయ సినిపరిశ్రమ అంతా ప్రశాంత్​ నీల్​ గురించే చర్చించుకుంది. అంతటి క్రేజ్​ ఉన్న ప్రశాంత్​ నీల్​.. ప్రభాస్​తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రశాంత్​ నీల్​ ప్రస్తుతం […]

Read More

మెగాడాటర్​ ప్రాజెక్ట్​కు బ్రేక్​

మెగాస్టార్​ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ‘గోల్డ్​ బాక్స్​ ఎంటర్​టైన్​మెంట్స్​’ అనే ఓ బ్యానర్​ను స్థాపించి వెబ్​సీరిస్​ను నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఆమె తన తల్లి సురేఖ చేతుల మీదగా ఈ ఓ వెబ్​సిరీస్​ను ప్రారంభించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​ కీలకపాత్ర పోషిస్తుండగా.. ‘ఓయ్​’ ఫేమ్​ ఆనంద్​ రంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. కొన్నిరోజుల పాటు షూటింగ్​ కూడా చేశారు. కానీ కరోనాతో ప్రస్తుతం షూటింగ్​ నిలిచిపోయింది. దీంతో సుష్మితా చాలా నిరుత్సాహానికి గురయ్యారట. […]

Read More

సురేందర్​రెడ్డి కొత్త ప్రయోగం

ప్రముఖ దర్శకుడు సురేందర్​రెడ్డి ఓ వెబ్​సిరీస్​కు దర్శకత్వం వహించబోతున్నాడంటూ సినీవర్గాల్లో జోరుగా టాక్​నడుస్తున్నది. తెలుగులో ఇప్పటివరకు ఏ దర్శకుడు టచ్​చేయని ఓ ప్రయోగాత్మక కథకు సిరీస్​కు ఆయన దర్శకత్వం వహించబోతున్నారట. ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్​ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​ ఆహాలో దీన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. సురేందర్​రెడ్డి తెలుగులో సైరా నరసింహారెడ్డి, కిక్​ సహా ఎన్నో హిట్​ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సైరా తరువాత మరో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వరుణ్​తేజ్​తో ఓ సినిమాను […]

Read More