విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ‘నారప్ప’ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఓ పోస్టర్ యువతను తెగ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్’కు రీమేక్‌గా ఈ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ నటించిన ఈ సినిమా అక్కడ భారీవిజయాన్ని సొంతం చేసుకున్నది. దళితుడి జీవితానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ మాతృకకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. […]