సామాజికసారథి, వెల్దండ: హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం చాటుకున్నారు. వైద్యవిద్యార్థినికి కొండంత సాయం అందించారు. ప్రజల రక్షణంలోనే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంటామని నిరూపించారు. ఇటీవల వెల్లడించిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సంపాదించిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ ఫ్రాంక్లిన్, అలివేలు దంపతుల కూతురు సృజన వైద్యచదువులకు చేయూతను అందించారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శేఖర్ సోమవారం తనవంతు సహాయంగా ఎస్సై నర్సింహులుతో కలిసి సదరు […]