హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌వీ) వచ్చే విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జేఎన్‌వీఎస్ వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్ www.navodaya.gov.inలో డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రవేశ పరీక్షను 2021 ఏప్రిల్ 10న ఉదయం 11.30 గంటలకు దేశంలోని అన్ని జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్ష ఫలితాలను 2021 జూన్ నెలలో ప్రకటిస్తారు.ఎవరెవరు అర్హులు?జవహర్ నవోదయ […]