సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో డ్రైనేజీ గుంతలు పిల్లలు ప్రాణసంకటంగా మారాయని నేషనల్ ఉమేష్ పార్టీ అధ్యక్షురాలు హసీనాబేగం అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మరమ్మతులు పనుల్లో జాప్యం ద్వారా స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తవ్విన గుంతలను పూడ్చివేయాలని సూచించారు. కాలనీవాసులు పలు సమస్యలను తమ దృష్టికి తెచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు.