సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు నీటి ఉధృతి పెరుగుతోంది. గతవారం 27 గేట్లను ఎత్తగా, అదేస్థాయిలో మంగళవారం సాయంత్రం కూడా 27 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గంటగంటకూ వరద పెరుగుతుండడంతో నదీతీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ప్రస్తుతం 2.27లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు జూరాలకు నిలకడగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం 9.657 టీఎంసీల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం జూరాలకు 63,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇలా ప్రాజెక్టు నుంచి మొత్తం 60,856 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. నాలుగుగేట్ల ద్వారా 22,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 35,974 క్యూసెక్కుల […]