సారథి, రామడుగు: వెంకటేశ్వర నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రామడుగు గ్రామశాఖ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. రామడుగు మండలాధ్యక్షుడిగా సముద్రాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా సముద్రాల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల నారాయణ, కోశాధికారి సముద్రాల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ బాధ్యతగా వ్యవహరిస్తూ సంఘ అభ్యున్నతికి పాటుపడుతామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.