Breaking News

MUNIPAL

పారిశుద్ధ్యం అధ్వానం

ఇంత నిర్లక్ష్యమా?

సారథి న్యూస్​, రామగుండం: పారిశుద్ధ్యం విషయంలో రామగుండం మున్సిపాలిటీ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు శనిగల శ్రీనివాస్​, శనిగరపు చంద్రశేఖర్​ ఆరోపించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో విలేకరులతో మాట్లాడుతూ.. కరోనాతోపాటు ఇతర వ్యాధుల ముంపు పొంచిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం టెస్టులు చేయకపోవడంతో పేదలు కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీరు మారకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చేపడతామని పేర్కొన్నారు.

Read More