సారథి న్యూస్, హుస్నాబాద్: మున్సిపాలిటీలలో పని చేస్తున్న మెప్మా ఆర్పీలకు వేతనాలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మెప్మా ఆర్పీలకు సంవత్సరం నుంచి వేతనాలు అందించడం లేదని చెప్పారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్, మెప్మా డైరెక్టర్ వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
సారథి న్యూస్, అలంపూర్: కరోనా నివారణ చర్యల్లో భాగంగా బుధవారం అలంపూర్ మున్సిపాలిటీలో డ్రోన్ సాయంతో సోడియం హైపో ద్రావకాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రతివార్డులో 20 లీటర్ల చొప్పున పది వార్డులకు రెండొందల లీటర్ల ద్రావకాన్ని పిచికారీ చేయిస్తున్నట్టు వివరించారు. అందుకోసం రోజుకు రూ.20వేలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ సుష్మారావు, అల్లాబకాష్, సమీర్, గంగిరెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.