సారథి న్యూస్, ములుగు: ప్రజావిజ్ఞప్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముగులు జిల్లా అడిషనల్కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ–ఫైలింగ్ ద్వారా ప్రభుత్వ కార్యాకలాపాలు నిర్వహించాలని సూచించారు. ప్రజావాణికి అధికారులంతా తప్పనిసరిగా నివేదికలతో రావాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,842 విజ్ఞప్తులు రాగా, 1,335 పరిష్కరించినట్లు వివరించారు. పల్లెప్రగతి పనులు వెంటవెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో […]