ఆయనో ప్రజాప్రతినిధి.. తమ సమస్యలను పరిష్కరిస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ పార్లమెంట్‌కు వెళ్లిన సదరు ఎంపీ అశ్లీల వీడియోలు చూస్తూ మీడియాకు అడ్డంగా దొరికారు. అదృష్టవశాత్తు ఆయన మనదేశపు ఎంపీ కాదు. థాయిలాండ్ చోన్బూరి ప్రావిన్స్ ఎంపీ రోన్నాథెప్ అనువత్. గురువారం థాయిలాండ్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంపై చర్చ జరుగుతున్నది. ఎంపీ గారికి బడ్జెట్ ప్రసంగం బోర్‌కొట్టినట్టుంది. వెంటనే ఫోన్ తీసి బూతు వీడియోలు ఓపెన్ చూశాడు. తాను పార్లమెంట్లో ఉన్నానని.. […]
సారథిన్యూస్, జనగామ: సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవాపురంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన శ్రీకాంత్(20) కొంతకాలంగా సెల్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులు అడుతున్నాడు. ఆర్థికపరిస్థితి బాగా లేకపోవడంతో వారు కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.