సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు శనిగరపు ప్రకాష్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు. శనిగరపు ప్రకాష్ తల్లి చెంద్రమ్మ ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రకాష్ కుటుంబ సభ్యులు, వెదిర వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్, కిమ్స్ లా కాలేజ్ […]
సారథి న్యూస్, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.