సారథి న్యూస్, వనపర్తి: పాఠశాల విద్యారంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పిలుపునిచ్చారు. ఆ కర్తవ్య నిర్వహణలో ప్రధానంగా టీఎస్ యూటీఎఫ్ టీచర్ల పాత్ర గణనీయమైందని సూచించారు. ఆదివారం వనపర్తి యాదవ భవనంలో టీఎస్ యూటీఎఫ్ మూడవ జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగారుస్తున్నాయని ఆక్షేపించారు. రాష్ట్రంలో సుమారు […]