సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు. రామలింగారెడ్డికి భార్య కూతురు, కుమారుడు ఉన్నారు. 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో నాలుగు సార్లు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 నుంచి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 25 ఏళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ప్రజాసమస్యలు, […]