సారథి న్యూస్, నర్సాపూర్: నియోజకవర్గకేంద్రమైన నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.