సారథి, కోడేరు(కొల్లాపూర్): కోడేరు మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో విషజ్వరాల బారినపడిన ప్రతిఒక్కరినీ ఇంటింటికి తిరిగి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాలనీలో ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటుచేసి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్ఆస్పత్రికి తీసుకెళ్తామన్నారు. అంబులెన్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామన్నారు. అలాగే రైతుబీమా వచ్చేలా చూస్తామని హామీ […]
సారథి, కోడేరు. అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలకు రూ.10 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. కోడేరు మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. కరోనా కారణంగా సంవత్సరన్నర కాలంగా […]
సారథి, కొల్లాపూర్: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారనున్నాయని నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతమ్మ, కలెక్టర్ ఎల్.శర్మన్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు, ముక్కిడిగుండం, పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటారు. మన ఇంటిని, వీధిని, ఊరును మనమే శుభ్రంగా ఉంచుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ఉద్దేశం అదేనని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో […]
సారథి, కొల్లాపూర్: కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తక్షణ సాయం కింద ప్రభుత్వం మంజూరుచేసిన రూ.రెండువేల ఆర్థిక సహాయం చెక్కులను గురువారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందజేశారు. నాగర్‌కర్నూల్‌జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో 10మంది చిన్నారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకట రమణమ్మ, ఐసీడీఎస్ నిరంజన్, సూపర్వైజర్లు పాల్గొన్నారు.సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కుల పంపిణీనిరుపేదలకు సీఎం రిలీఫ్ఫండ్వరంగా మారిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన కొల్లాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే […]
సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కయిపల్లి చాకలి మడుగువాగుపై రూ.40లక్షల వ్యయంతో చేపట్టనున్న కల్వర్టు బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గురువారం భూమిపూజ చేశారు. చాకలిమడుగుపై కల్వర్టు బ్రిడ్జి లేక ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బ్రిడ్జి నిర్మించడం ద్వారా చుక్కయిపల్లి ప్రజలు, రైతుల కష్టాలు తీరనున్నాయని, రైతులు తమ పొలాలకు వెళ్లడానికి, ధాన్యాన్ని తరలించడానికి ఇబ్బందులు ఉండవని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గున్ రెడ్డి నరేందర్ […]