కీర్తిసురేశ్ తాజాగా నటిస్తున్న ‘మిస్ఇండియా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్లో తెలియజేశాడు. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరికొన్ని సాంగ్స్ సిద్ధమవుతున్నాయని తమన్ తెలిపారు.