సారథి న్యూస్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో 99శాతం మంది కరోనా రోగులు రికవరీ అవుతున్నారని మంత్రి కె.తారకరామారావు అన్నారు. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కోవిడ్–19 ఐసీయూ సెంటర్, 40 పడకల ఆక్సిజన్ వార్డుతో పాటు కోవిడ్ అంబులెన్స్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. పంచాయతీరాజ్ ఈఈ, డీఈఈ ఆఫీసులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రికి సీఎస్ఆర్ పథకం కింద రూ.2.28 కోట్లు […]