చెన్నై: నటి మీరా మిథున్ నిత్యానందపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన చాలా గొప్పవాడని.. మీడియా అనవసరంగా నిత్యానందపై తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొంది. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘నిత్యానంద చాలా గొప్పవ్యక్తి. ఆయన గురించి అంతా దుష్ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే నేను నిత్యానంద సృష్టించిన కైలాసానికి వెళ్లి.. ఆయనను కలుసుకుంటాను. ఆయనంటే నాకు ఎంతో గౌరవం’ అంటూ మీరామిథున్ నిత్యానందను పొగడ్తల్లో ముంచెత్తింది. కాగా మీరా వ్యాఖ్యలపై నెట్జన్లు మండిపడుతున్నారు.