సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు గిరిజనులకు 20 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మాతాశిశు సంరక్షణ వైద్యాధికారి డాక్టర్ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా పెనుగోలు గిరిజనుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నామని, వారికి వైద్యపరీక్షలు నిర్వహించామని తెలిపారు. 20 మందికి జ్వరాలు ఉండగా, వారి నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షించగా ముగ్గురికి మలేరియా ఉన్నట్లు గుర్తించి మందులు ఇచ్చామన్నారు. అలాగే పలు రకాల […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా వాజేడు మండలంలోని మెురుమూరు పంచాయతీ గణపురం గ్రామంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారు, గర్భిణులు, బాలింతలు, క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. బీపీ, షుగర్వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యచికిత్సలు చేశారు. కరోనా సమయంలో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ డి.వెంకటేశ్వరరావు, […]