సారథి, రామడుగు: కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకోసం కార్మిక లోకం ఉద్యమించాలని కరీంనగర్సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మే డే సందర్భంగా రామడుగు మండలంలోని దేశరాజుపల్లి, రామడుగు, గుండి, లక్ష్మిపూర్, గోపాలరావుపేట తదితర గ్రామాల్లో ఎర్రజెండా ఎగరవేసి కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని తాకట్టు పెడుతూ రైతులను వారి భూముల్లోనే పాలేర్లుగా మార్చుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల […]
సారథి, వేములవాడ: నాకా వర్కర్ల ఆధ్వర్యంలో శనివారం ముంబైలోని పశ్చిమ విలేపార్లే నాకా వద్ద మే డే, మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విలేపార్లే నాకా వర్కర్ల సంఘం అధ్యక్షుడు చవల్ రమేష్ మాల మాట్లాడుతూ.. దేశంలో కార్మికులకు, మహిళలకు, ఉద్యోగులకు సమాన వేతనాలు, 14 గంటల నుంచి 8 గంటల వరకు కుదింపు, కార్మిక సంఘాలకు గుర్తింపు తదితర రాజ్యాంగ పరమైన హక్కులను భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించారని కొనియాడారు. […]
సౌత్‌లో మంచి సినిమాలే చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కొద్దికాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్, నితిన్ తో రెండు సినిమాలకు కమిటైంది. అలాగే కోలీవుడ్ లో భారతీయుడు–2, అయాలన్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే బాలీవుడ్ మరో ఆఫర్ రకుల్‌ను వరించింది. లాస్ట్ ఇయర్ అజయ్ దేవ్గన్చిత్రం ‘దేదే ప్యార్ దే’ లో నటించింది. అందులో రకుల్ గ్లామరస్ రోల్ అందరినీ మెప్పించింది. మోతాదుకు మించి గ్లామర్ ఒలకబోసింది. దీంతో […]
సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ), అర్జీ1 కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఆఫీస్, ఏరియా వర్క్ షాప్, రమేష్ నగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, కనకయ్య, మహేష్, మెండ శ్రీనివాస్, జె.గజెందర్, సానం రవి, అంజయ్య, కె రంగారావు, వంగల రాములు పాల్గొన్నారు.