సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామ పంచాయతీలో ఎంపీపీ చిలుక రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, వరి కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు ఐదొందల మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నదని, ప్రజలంతా మాస్కులు ధరించి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలి. గ్రామంలో ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరికివారు తమ […]