సారథి న్యూస్, చేవేళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని శంకర్ పల్లి లో నూతనంగా రూ.50లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసును ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.