Breaking News

MARIKALA

ఇంటింటికీ మొక్కలు పంపిణీ

సారథి న్యూస్​, ములుగు: వెంకటాపురం మండలంలోని మరికాల గ్రామంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం పర్యటించారు. హరితహారంలో భాగంగా మరికాల పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలోని ప్రతి ఇంటికి పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్ పనులు, రైతు వేదిక పనులు పరిశీలించారు. ఆయన వెంట నుగూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బుచ్చయ్య, జడ్పీటీసీ రమణ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో అనురాధ ఉన్నారు.

Read More