ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలతకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఫేస్బుక్లో పోస్టుచేశారు. ‘శనివారం నుంచి తలనొప్పి, గొంతునొప్పితో బాధపడుతున్నాను. దీంతో అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హోంక్వారంటైన్లోనే ఉన్నాను. డాక్టర్ల సూచనలతో మందులు వాడుతున్నాను. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. కరోనా సోకినవారెవరూ ఆందోళన చెందొద్దని.. ధైర్యంగా ఉండి మందులు వాడాలని సూచించారు.