సారథి న్యూస్, బిజినేపల్లి: ట్రాక్టర్.. రోటవేటర్ కిందపడి ఆరేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. మహాదేవుని పేటకు చెందిన రైతు బక్క చిన్న మాసయ్య పొలంలో రోటవేటర్‌తో దుక్కిదున్నుతున్నాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వచ్చిన అతడి కుమారుడు ప్రవీణ్‌కుమార్(6) వెనుక నుంచి పరిగెత్తుకుంటే వెళ్లి రోటవేటర్ లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గమనించి ట్రాక్టర్ ఆపగా అప్పటికే ప్రవీణ్ […]