Breaking News

MADDUR

మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, హుస్నాబాద్: మృతుడి కుటుంబానికి వాట్సాప్ గ్రూపు సభ్యులు మేమున్నామని చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ దామెర మల్లేశం మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొందుగుల వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. సోషల్ మీడియాలో ఒక్కటైన గ్రూప్ సభ్యులు తలకొంత డబ్బులు వేసుకుని 50కిలోల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మల్లేశం, గ్రూప్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

Read More
ఘనంగా వైఎస్సార్​వర్ధంతి

ఘనంగా వైఎస్సార్​ వర్ధంతి

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో వైఎస్సార్​సీపీ టౌన్​అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు వైఎస్సార్​విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మద్దూర్ నగర్ లో శరణాలయానికి టీవీ, మంచాలు, ఫ్యాన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య, వైఎస్సార్​సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త […]

Read More