సారథి న్యూస్, మహబూబ్ నగర్: పిడుగుపాటుకు గురై ఇటీవల మరణించిన కుటుంబానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం రూ.40వేల చెక్కు, ఇతర సరుకులను అందజేశారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి పంచాయతీ పరిధిలోని రోళ్లగడ్డతండాకు చెందిన భీమ్లా నాయక్, సరోజ దంపతులు గతనెల 28న పిడుగుపాటుకు గురై చనిపోయారు. మంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.