ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: మాజంలో ఏ ఒక్కరూ వెనకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ రూపకర్తలకు నివాళర్పిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్ 26 చారిత్రక దినం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశతత్వాన్ని రాజ్యాంగ పీఠిక ప్రతిబింబించిందని గుర్తుచేశారు. ప్రజాసంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి జరగాలని సూచించారు. భారతీయులంతా ఒక్కటే.. ఒకరి కోసం అందరం ఉన్నామని చెప్పారు. సవాళ్లకు అనుగుణంగా […]