ప్రముఖ హాస్యనటి, తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన విద్యుల్లేఖ రామన్ త్వరలోనే తన ప్రియున్ని పెళ్లి చేసుకోబోతుంది. కొంత కాలంగా ఆమె ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ సంజయ్‌తో ప్రేమలో పడింది. కాగా మంగళవారం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో వీరిద్దరికి ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబాల ఆమోదంతోనే వివాహం నిశ్చయమైంది. కొంతమంది ప్రముఖులు, సమీప బంధువుల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్‌గా మారాయి.
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార.. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి దేశంలోని ప్రముఖ తీర్థయాత్రలకు వెళ్లనున్నట్టు సమాచారం. ఈ మేరకు తమిళ ఫిలిం వెబ్సైట్లు, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నయన్, విఘ్నేశ్‌పై కొంతకాలంగా తరుచూ ఏవో ఒక వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ఓ గుడిలో రహస్య వివాహం చేసుకున్నారని కొంత కాలం క్రితం వార్తలు వినిపించాయి. పెళ్లికి ముందు నయనతార కొన్ని దేవాలయాలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాల్సి ఉందట. ఈ […]