వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ సమీపంలో ఉన్న ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ఉన్న బాయిలర్ ఉన్న చోట పైపులు పగిలిపోవడంతో మంటలు చెలరేగి మంటలు అంటుకున్నాయి. సమీపంలో ఉన్న ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. మిగతా నలుగురిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.