సామాజిక సారథి, నెట్వర్క్: ఇంటింటా దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గుమ్మాల ముందు వెలిగించిన దీపాలు కొత్త శోభను తెచ్చిపెట్టాయి. పటాకుల ఢాం.. ఢాం చప్పుడు ఊరూవాడంతా, పల్లెపట్టణమంతా దద్దరిల్లింది. వెరసి దీపావళి సంబరాలు సంతోషం నింపాయి. దీపం వెలిగించిన చోట ఆరోగ్యం, ధనసంపదలు, శుభాలు, బుద్ధిప్రకాశం విరాజిల్లుతాయి. శుభకార్యాల్లో దీపం వెలిగిస్తే విజయాలు కలుగుతాయని, అది విజయ సంకేతమని పురాణాలు చెబుతుంటారు. ప్రతి పనిని ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగించి పూజ చేయడం ఆచారంగా వస్తోంది. లక్ష్మీదేవి […]
నేటినుంచే శ్రావణమాసం ప్రారంభం ఈ మాసంలోనే విశిష్ట పర్వదినాలు సన్నటి చిరుజల్లులతో నాన్పుడు వానలు.. అడపాదడపా కుంభవృష్టి.. బోనాల సందడి.. మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు, పచ్చగా పసుపు పూసిన పాదాలతో సందడిగా తిరిగే ముత్తయిదువల కళకళ.. అంతటా ఆధ్యాత్మిక వాతావరణం, ప్రకృతి శోభ ఇనుమడించే తరుణమిది…ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రత్యేకతలపై ‘సారథి’ అందిస్తున్న స్పెషల్ స్టోరీ.. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. […]