సారథి న్యూస్, రామడుగు : కరోన లాక్ డౌన్ నేపథ్యంలో గల్ఫ్ లో చిక్కుకున్న కార్మికుల ఆదుకోవాలని దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవా సమితి మీడియా కో-ఆర్డినేటర్ చిలముల రమేష్ పిలుపు మేరకు గల్ఫ్ జేఏసీ మండల కమిటీ సభ్యులు తహసీల్దార్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కోరె కరుణాకర్ రెడ్డి, యమా అరుణ్, భగత్, విజయ్, అనిల్, మండల శేఖర్, పోతు మహేష్, అశోక్, నాగం మోహన్, బడుగు సాయి తేజ పాల్గొన్నారు.