సారథి న్యూస్, కర్నూలు: పాత కార్మికులను తొలగించి వారి స్థానంలో డబ్బు వసూలు చేసి కొత్త వారిని నియమించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆరోపణలు చేసే వారు దమ్ముంటే నిరూపించాలని నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొందరు తమ పార్టీ నాయకులే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం కార్మికుల జీవితాలతో ఆటలాడడం సరికాదన్నారు. ప్రతి కార్మికుడికి అండగా ఉండి సేవచేస్తానని, వీలైనంత సాయం చేస్తానే […]