ఎస్సైకి నిప్పంటుకున్న వైనం రెండువర్గాలుగా విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు సామాజికసారథి, జోగుళాంబగద్వాల: జిల్లాలోని కేటీదొడ్ది మండలం ఇర్కిచేడులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గురువారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు రెండువర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకూ వినని ఓ వర్గం వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించారు. దీంతో అక్కడే ఉన్న ఎస్సైకి నిప్పంటుకుంది. కాగా ప్రత్యర్థివర్గం వారు వెంటనే […]
కేటీదొడ్డి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాగుంట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించడంతో రమేష్ కు చెందిన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. టీవీ, రెండు క్వింటాళ్ల బియ్యం, దుస్తులు, సామాన్లు కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.రెండులక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సుభాషిణిరెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు రమేష్ కోరాడు.