సారథి న్యూస్, వాజేడు: మండల కేంద్రంలోని కొంగలలో శ్రీరాములు, బొల్లె ప్రసాద్, బెల్లాల అజయ్ రాంరెడ్డి స్మారకార్థం జగన్నాథపురం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో కొంగల జట్టు చాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం మండలాల నుంచి 56 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో భాగంగా కొంగల కింగ్స్ లెవెన్, జగన్నాథపురం రైజింగ్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కొంగల జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 127 […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామంలో గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అందరూ కచ్చితంగా మాస్కులు కట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని డాక్టర్లు సూచించారు. బీపీ, షుగరు, టీబీ ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశావర్కర్లు, 104 వాహన సిబ్బంది పాల్గొన్నారు.