న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రాజీవ్గాంధీ ఖేల్‌రత్న అవార్డు కోసం.. బాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించింది. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన శ్రీకాంత్.. క్షమాపణలు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అర్జున అవార్డుకు తన పేరును ప్రతిపాదించకపోవడంతో విమర్శలు చేసిన హెచ్ఎస్ ప్రణయ్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘ఫిబ్రవరిలో ఆసియా టీమ్ చాంపియన్ షిప్ సెమీస్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్ వేరే టోర్నీ కోసం బార్సిలోనా వెళ్లారు. జట్టును […]