సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర పుష్కరాలకు కార్తీక శోభ సంతరించుకుంది. పవిత్ర సోమవారం కావడం, పుష్కరాలు 11వ రోజు కావడంతో పలు ఘాట్లకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండల పరిధిలోని పుల్లూరు పుష్కర ఘాట్ కు తాకిడి పెరిగింది. ఇక్కడ వేలసంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పరిధిలోని ఘాట్లలో నదీస్నానాలకు అనుమతి లేకపోవడంతో అలంపూర్ పుష్కర ఘాట్ కు భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. కొందరు నదిలో […]